తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 3న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. మార్చ్ నాలుగో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారని సమాచారం. అప్పటికి మహేష్ సర్కారు వారి పాటను పూర్తి చేస్తాడట. దాని తర్వాత బ్రేక్ తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు షిఫ్ట్ అవుతాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.