ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

హిందీ ఎంట్రీపై కామెంట్స్ వైరల్… క్లారిటీ ఇచ్చిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతుంది. సినిమా విడుదల నేపథ్యంలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో వైపు ఆయన నిర్మించిన మేజర్ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో హిందీ లో ఎంట్రీ ఇవ్వడం పై మహేష్ బాబు స్పందిస్తూ వారు నన్ను భరించలేరు అన్నట్లుగా సరదా వ్యాఖ్యలు చేశాడు.

ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి.. కొందరు వాటిని వివాదాస్పదం చేసే విధంగా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. హిందీ సినిమాల పట్ల మహేష్ బాబు వ్యాఖ్యలను ట్విస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దాంతో మహేష్ బాబు తాజా ప్రెస్ మీట్ లో ఆ వ్యాఖ్యలకు క్లారిటీ ఇస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనకు స్టార్ డమ్ ఇచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయడం ఆసక్తి.. అలాగే తనకు అన్ని భాషలపై కూడా గౌరవం ఉందన్నాడు.

హిందీలో నటించే విషయంలో తనకు ఇబ్బంది ఏమీ లేదు కాని తెలుగు లో కంఫర్ట్ అన్నట్లుగా మహేష్ బాబు వ్యాఖ్యలు చేయడంతో వాటిని కాస్త వివాదాస్పందం చేసే విధంగా ప్రచారం చేశారు. మహేష్ బాబు త్వరలో చేయబోతున్న రాజమౌళి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నట్లుగా కూడా పేర్కొన్నారు.

తెలుగు సినిమాలు అన్ని చోట్ల విడుదల అవ్వడం సంతోషం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. సర్కారు వారి పాట సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో మహేష్ బాబు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

హిందీ లో నటించాలనే ఆసక్తి లేదని తేల్చి చెప్పిన మహేష్ బాబు తనకు అన్ని భాషలపై గౌరవం ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఏ భాషలో కంఫర్ట్ ఉంటే అక్కడే నటించాలని తాను భావిస్తాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడంతో మేజర్ సినిమా ప్రెస్ మీట్ సందర్బంగా చేసిన వ్యాఖ్యలకు మహేష్ క్లారిటీ ఇచ్చినట్లయ్యింది.

మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా కు పరశురామ్ దర్శకత్వం వహించాడు. భారీ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ ను చూస్తుంటే అనిపిస్తుంది. దాంతో ఈ సినిమా ను హిందీలో డబ్ చేస్తే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో మాస్ సినిమాలకు అక్కడ మంచి ఆధరణ ఉంటుంది. అందుకే ఈ సినిమా అక్కడ డబ్బింగ్ చేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Exit mobile version