అసలు ఈ టాటూ వెనుక కారణమేమిటా అని తెలుసుకోగా.. మొదట కథ అనుకున్న దాని ప్రకారం, దాదాపు సగ భాగం అమెరికాలో షూట్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా మొదట్లో మెడపై ఒక డాలర్ సింబల్ ని వేయాలనుకున్నారు. కానీ సడన్ గా లాక్ డౌన్ రావడంతో ఇప్పుడప్పుడే అబ్రాడ్ వెళ్లే పరిస్థితి లేదు. దాంతో మహేష్ బాబు కథని ఇక్కడి పరిస్థితులకి తగ్గట్లుగా చేంజ్ చేశారు. దాంతో ముందుగా అనుకున్న డాలర్ ని కాన్సల్ చేసి, రూపాయి సింబల్ ని వేశారు.
సినిమా కథాంశం మొత్తం ప్రభుత్వంలో జరిగే కొన్ని లూప్ హొల్స్ గురించి, మనీ లాండరింగ్ లాంటి విషయాలను గట్టిగానే ప్రస్తావించనున్నారని సమాచారం. అలాగే ఓ స్ట్రాంగ్ మేసే తో పాటు పరశురామ్ మార్క్ ఫామిలీ కథాంశం, లవ్ స్టోరీ కూడా ఉంటుందని ఈ చిత్ర టీం చెబుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టీం దాదాపు బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు చేశారు. ఒకవేళ లాస్ట్ మినిట్ లో కుదరకపోతే పూజ హెగ్డేని తీసుకునే ఆలోచన ఉంది. కొంచం షూటింగ్స్ అన్ని రెగ్యులర్ అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.