ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మహేష్‌, ఎన్టీఆర్‌ చెప్పినా ఈ ‘బూతు దురభిమానం’ ఆగదా.?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మధ్య ‘అన్నదమ్ముల్లాంటి’ అనుబంధం వుంది. ఇద్దరూ ఒకే వేదికపై కన్పించి.. అభిమానులంతా కలిసి మెలిసి వుండాలని కోరారు. కానీ, వారి మట పట్టించుకునే అభిమానులున్నారా.? చరణ్‌ – ఎన్టీఆర్‌ కావొచ్చు, మహేష్‌ – పవన్‌ కళ్యాణ్‌ కావొచ్చు.. మిగతా స్టార్‌ హీరోలు కావొచ్చు.. అంతా అన్నదమ్ముల్లానే వుంటారు. వృత్తిపరమైన పోటీ ఖచ్చితంగా వుండాలి.. వుంటుంది కూడా.!

అంతెందుకు, చిరంజీవి – బాలకృష్ణ ఎప్పుడు కలుసుకున్నా అన్నదమ్ముల్లానే వ్యవహరిస్తారు. రాజకీయ విమర్శలంటారా.. అది వేరే వ్యవహారం. హీరోల మధ్య లేని విభేదాలు, అభిమానుల మధ్య ఎందుకు.? ఎన్నో దశాబ్దాలుగా వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే, ఆ దురభిమానం ఇప్పుడు హద్దులు దాటేస్తోంది. మహేష్‌బాబుని.. సార్‌ అని పిలవాలంటూ ఓ హీరోయిన్‌ని నానా బూతులు తిడతారు కొందరు అభిమానులు. ఇది మహేష్‌ ఒక్కడికే కాదు, చాలామంది హీరోలకు ఎదురవుతున్న సమస్య.

తాజాగా, తనకు మహేష్‌ అంటే ఇష్టమని చెబుతూ, యంగ్‌ టైగర్‌ గురించి తెలియదని ‘బంగారం’ ఫేం హీరోయిన్‌ మీరా చోప్రా చెబితే, ఆమెను నానా బూతులు తిట్టారు జూ.ఎన్టీఆర్‌ అభిమానులు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందనుకోండి.. అది వేరే విషయం. మహేష్‌ కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన రీతిలో బూతుల్ని వాడిన ఎన్టీఆర్‌ అభిమానుల దురభిమానాన్ని కొందరు సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. సేమ్ టు సేమ్ యంగ్‌ టైగర్‌ కుటుంబ సభ్యులపైనా ఇదే తరహాలో బూతుల ప్రవాహం సోషల్‌ మీడియాలో కన్పిస్తోంది.

ఆ మాటకొస్తే, ఏ హీరో కూడా ఈ దురభిమానుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోలేడేమో.. అనే స్థాయిలో ఆయా హీరోల కుటుంబ సభ్యుల్ని దూషిస్తున్నారు ‘అభిమానం’ ముసుగులో. పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, చిరంజీవి.. ఇలా చెఫ్పుకుంటూ పోతే, లిస్ట్‌లో ఎవరికీ మినహాయింపు లేదు. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్‌ స్టాప్‌ పడాలి. పోలీసు వ్యవస్థకు వేరే పని లేదా.? ఇలాంటి చిల్లర విషయాల్ని డీల్‌ చేయాలా.? సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్ పైనే వీటికి సెన్సార్‌ అయితే ఎంత బావుండు.? అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి సోషల్‌ మీడియా నిపుణుల నుంచి.

నిజమే మరి.. అరెస్టులంటూ మొదలెడితే, మన తెలుగు రాష్ట్రాల్లోని జైళ్ళు సరిపోవు.. అంత చెత్త సోషల్‌ మీడియాలో రాజ్యమేలుతోంది. సినీ ప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులూ ఈ ‘బూతుల దురభిమానం’ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఎవడైనాసరే.. ఏ హీరో అభిమాని అయినాసరే.. ఏ పొలిటికల్‌ లీడర్‌ అభిమాని అయినాసరే.. తనకూ ఓ కుటుంబం వుందనీ, అందులోనూ తల్లి, చెల్లి వున్నారనీ ఆలోచించుకుంటే.. ఈ తరహా దౌర్భాగ్యానికి ఆస్కారమే వుండదు. సోషల్‌ మీడియాలో అంతా మా ఇష్టం.. ఎవర్నయినా తిడతాం.. అంటే, మనుషులకీ జంతువులకీ తేడా ఏముంది.? ఆ మాటకొస్తే, ఈ సోషల్‌ దురభిమానులకంటే, జంతువులే

Exit mobile version