ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మహేష్, పూరి మధ్య వివాదం సమసిపోయిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ది ఒక ఆసక్తికరమైన కాంబినేషన్. ఇద్దరూ కలిసి పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సాధించారు. అలాగే ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ ఎంతటి సంచలనమో అందరికీ తెలుసు. మహేష్ చేత డైలాగులు చెప్పించడంలో పూరి శైలి వేరు. మహేష్ కు రెండు బెస్ట్ మూవీస్ ఇచ్చారు. అందుకే మహేష్ అభిమానులకు పూరి అంటే ప్రత్యేకమైన గౌరవం.

అయితే కొద్ది నెలల కిందట ఇద్దరి మధ్య వివాదం వచ్చింది. మహేష్ బాబు కేవలం సక్సెస్ లు ఉన్నప్పుడే సినిమాలు చేస్తాడు అని పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం వివాదాస్పదమైంది. అలాగే మహేష్ తో మరోసారి పనిచేయను అన్న తరహాలో పూరి మాట్లాడారు. అప్పటినుండి మహేష్ అభిమానులు కూడా పూరి అంటే కోపంగానే ఉన్నారు. రీసెంట్ గా మహేష్ పుట్టినరోజుకు పూరి జగన్నాథ్ శుభకాంక్షలు చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్యా దూరం ఇంకా అలాగే ఉందని అనుకున్నారు అందరూ.

అయితే ఈరోజు పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నా ఫేవరెట్ దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. అలాగే దానికి పూరి జగన్నాథ్ రిప్లై కూడా ఆకట్టుకుంది. సార్ మీ నుండి విషెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేసాడు. దీంతో మహేష్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
https://twitter.com/purijagan/status/1310497949269385217

Exit mobile version