సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమా కోసం దాదాపుగా 50 కోట్ల రూపాయల పారితోషికంను చిరు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ఈజీగా 150 కోట్ల బిజినెస్ చేస్తుందనే నమ్మకం ఉంది. అందుకే చిరంజీవికి అంత పారితోషికంకు ముందుకు వచ్చారు. దానికి తోడు కొరటాల శివ దర్శకత్వం అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక ఆచార్య తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా వేదాళం రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాను అనీల్ సుంకర నిర్మించబోతున్నాడు.
ఈ సినిమాకు గాను చిరంజీవికి ఏకంగా 60 కోట్ల పారితోషికంను అనీల్ సుంకర ఇవ్వబోతున్నాడట. హీరోల పారితోషికాలు అమాంతం పెంచేస్తున్న నిర్మాతగా అనీల్ సుంకరకు మొదటి నుండి పేరు ఉంది. ఇప్పుడు దాన్ని మరోసారి సార్థకం చేసుకున్నాడు. మహేష్‌బాబు కంటే అధికంగా చిరంజీవి పారితోషికం అందుకోవడం పట్ల అంతా కూడా అవాక్కవుతున్నారు. వేదాళం రీమేక్‌కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్న నేపథ్యంలో ఒకింత అనుమానం ఉన్నాకూడా నిర్మాత అనీల్ మాత్రం రూ.60 కోట్లు ఇవ్వడం ఏంటీ అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.