ఇప్పటికే చిన్నారుల గుండె ఆపరేషన్ల కేసుల్లో రికార్డు సృష్టించాడు సూపర్ స్టార్. ఈ సంగతులన్నీ భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటారు. రీసెంట్ గా మరో పాపకు గుండె ఆపరేషన్ చేయించాడు మహేష్ బాబు. ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో ఈ మహత్కర కార్యాన్ని గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు.
ఇక రీసెంట్ గా నమ్రత రివీల్ చేసిన వివరాల ప్రకారం మహేష్ డింపుల్ అనే చిన్నారి గుండె ఆపరేషన్ కు స్పాన్సర్ చేసాడు. ఆ చిన్నారి తీవ్రమైన కాల్సిఫైడ్ పల్మొనరీ వాల్వ్ తో తీవ్రమైన పల్మ్ వాల్వ్ స్టెనోసిస్ తో బాధపడుతోంది. ఆపరేషన్ తర్వాత ఆరోగ్యం ఇంతకు ముందు కంటే బాగుందని చెప్పడానికి ఆనందిస్తున్నట్లు నమ్రత తెలిపింది.
ఇలాంటి సహాయాలు మహేష్ మరిన్ని అందించాలని కోరుకుందాం.