“నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలాక చాలా లో ఫీల్ అయ్యాను. మానసికంగా కుంగిపోయాను. ఆ సమయంలో మహేష్ గారి సపోర్ట్ గురించి మర్చిపోలేను. నేను కోలుకుంటున్న సమయంలో ప్రతి 3 రోజులకు ఒకసారి మహేష్ నాకు కాల్ చేసేవారు. అసలు ఏం జరగనట్లే చాలా నార్మల్ గా మాట్లాడేవారు. ఎప్పుడూ ఏదో రకంగా జోకులు వేస్తూ నన్ను నవ్వించేవారు. నాలో చాలా కాన్ఫిడెన్స్ ను నింపారు ఆయన” అని అనిల్ రావిపూడి రివీల్ చేసాడు.
మహేష్, అనిల్ రావిపూడి కలిసి మరో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే దానికి ఇంకా సమయం పడుతుంది.