ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మహేష్‌ కంటే చిన్నే అయినా అమ్మగా ఓకే అంటున్న రేణు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాలో చిన్న పాత్రను అయినా చేయాలని హీరోయిన్స్‌, నటీనటులు కోరుకుంటూ ఉంటారు. అలాగే రేణు దేశాయ్‌ కూడా మహేష్‌ బాబు సినిమాలో నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. గతంలో హీరోయిన్స్‌గా చేసిన వారు పలువురు ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టి హీరోలకు హీరోయిన్స్‌కు అమ్మగా అక్కగా నటించేందుకు ఓకే చెబుతున్నారు. అలాగే మీరు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అలాంటి పాత్రలు చేస్తారా అంటూ రేణును అడిగిన సమయంలో ఆసక్తికర సమాధానం ఇచ్చిందట.

అమ్మగా అక్కగా నటించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మహేష్‌బాబు వంటి స్టార్‌కు అమ్మగా నటించాలని కోరుకుంటున్నాను. ఆయన ఒక మంచి నటుడు. ఆయన సినిమాలు నాకు నచ్చుతాయి. ఆయన సినిమాల్లో ఉండే పాత్రలు నాకు నచ్చుతాయి. అందుకే ఆయనకు తల్లిగా నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

రేణు దేశాయ్‌ వయసు 38(వికీపీడియా అనుసారంగా) ఇక మహేష్‌ బాబు వయసు 44 ఏళ్లు. అంటే మహేష్‌ కంటే రేణు దేశాయ్‌ ఆరు ఏళ్లు వయసులో చిన్న. అయినా కూడా ఆయనకు తల్లి పాత్రలో నటించేందుకు ఆసక్తిగా ఉందని చెప్పడం నిజంగా అభినందనీయం. నటి అనప్పుడు అన్ని పాత్రల్లో చేయాలి, అన్ని వయసుల పాత్రల్లో చేయాలి. అప్పుడే నటిగా పరిపూర్ణం అయినట్లు. ఆ ఉద్దేశ్యంతోనే తనకంటే పెద్ద వాడైన మహేష్‌కు తల్లిగా నటించేందుకు రేణు దేశాయ్‌ ఆసక్తిగా ఉంది.

Exit mobile version