అసెంబ్లీ సమావేశాల్లో కార్మిక, ఉపాధి కల్పన పద్దుపై చర్చ జరుగుతున్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి విశేష కృషి జరుగుతోందని అన్నారు. ప్రైవేటీకరణతో బీజేపీ కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ దేశ ప్రధాని అయితే దేశ ముఖచిత్రమే మారిపోతుందని అన్నారు.