అంతా సినిమాటిక్‌గా జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు దుండగలు తాము అనుకున్నది చేసుకుపోయారు. తన తండ్రిని దుండగులు కత్తితో బెదిరించి ఫోన్ లాక్కెళ్లడంపై హీరోయిన్ మీరా చోప్రా నేరాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ట్వీట్‌లో ఆమె వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఎంతో సురక్షితమని అంతా భావించే ఢిల్లీలోని పోలీస్ కాలనీలో వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగలు తన తండ్రిని కత్తితో బెదిరించి ఫోన్‌ను లాక్కుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మీరా చోప్రా తన ట్వీట్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. నార్త్ ఢిల్లీ డీసీపీ వెంటనే స్పందించి మరిన్ని వివరాలు ఇవ్వాలని కోరారు. మీరా చోప్రా సమాధానమిస్తూ…పీసీఆర్ పోలీస్ లేన్, మోడల్ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్ రోడ్డులో ఈ చోరీ జరిగిందని మరిన్ని వివరాలు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.