అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. వాళ్లిద్దరు ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలచింది. అలా మెహరీన్ జీవనగమనంలో అదో ఊహించని చేదు అనుభవంలా మిగిలిపోయింది. అప్పటి నుంచి మెహరీన్ సోషల్ మీడియాలకు దూరంగా ఉంటోంది. ఇప్పుడిప్పుడు మళ్లీ టచ్ లో కి వస్తుంది కానీ.. పూర్తిగా కాదు! అంతకు ముందు అభిమానులకు దూరంగానే ఉంటోంది.
అయితే ఈ భామ తాజాగా ఇన్ స్టాలో ఓ ఫోటోని పోస్ట్ చేసింది. అందులో ఓ రెస్టారెంట్ లో కూర్చొని ఉంది. ఎదురుగా టేబుల్ పై ఓ కప్ కూడా ఉంది. అయితే ఈ మూవ్ మెంట్ మెహరీన్ ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపించింది. ఆ ఫోటోని ఉద్దేశించి.. “ఇప్పుడు ఇలా మనస్పూర్తిగా ఉన్నాను..ఎంతో సంతోషంగా ఉన్నాను“ అని అర్ధం వచ్చేలా క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఆమె ఫాలోవర్లు అంతగా నవ్వడం వెనుక అసలు కారణం ఏంటో? అంటూ కామెంట్లు పెడుతున్నారు. భజన్ లాల్ మనవడితో ప్రేమాయణం వీడిపోయిన తర్వాత ఇంత ఆనందంగా కనిపిచడం ఇదే తొలిసారి. బహుశా ప్రియుడి జ్ఞాపకాల నుంచి పూర్తిగా దూరమైన వేళ ఇలా రెస్టారెంట్ లో సంతోషంగా గడుపుతోందా? అని ఇంకొంత మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. కారణం ఏదైనా గతాన్ని వదిలి వర్తమానంలోకి రావడం సంతోషకరమై విషయమే.
ప్రస్తుతం వెంకటేష్.. వరుణ్ తేజ్ నటిస్తోన్న `ఎఫ్ -3`లో నటిస్తోంది. అనీల్ రావిపూడి తెరకెక్కించిన `ఎఫ్ -2` చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ తెరెక్కుతోంది. ఎఫ్-2 భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఎఫ్ -3 పై రెట్టించిన అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇందులో హనీ పాత్ర కొనసాగింపులో అదరగొట్టనుంది మెహ్రీన్. పైగా కాంబినేషన్ లు జంటలు కూడా పాతవే కావడంతో అంచనాలు పీక్స్ కి చేరుతున్నాయి. అలాగే మెహరీన్ `మంచి రోజులు వచ్చాయి` అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మెహ్రీన్ బ్రేకప్ స్టోరి.. ఆ తర్వాత ఏమైంది?
అందాల కథానాయిక మెహ్రీన్ ఫీర్జదా తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి అప్పట్లో సడెన్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకుడు బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్ తో ఆయన కుటుంబంతో తనకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. నిశ్చితార్థం అయిన దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఈ వార్తలను మెహ్రీన్ ఇన్ స్టా ద్వారా ప్రకటించారు. తాము స్నేహపూర్వకంగా విడిపోతున్నామని వెల్లడించారు. ఇకపై భవ్య కుటుంబం లేదా స్నేహితులతో సంబంధం కలిగి లేమని తెలిపారు. ఈ సంఘటన గురించి తాను ఇకపై మాట్లాడనని ఆమె తన పోస్ట్ లో స్పష్టం చేసారు. తన అనుచరులు డియా నుండి కూడా గోప్యతను అభ్యర్థించారు.
రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ కూడా మెహ్రీన్ తో నిశ్చితార్థాన్ని విరమించుకోవడంపై ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది అతని గురించి అతడి కుటుంబం గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేస్తే తనను వ్యక్తిగతంగా దూషిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని.. ఆ వ్యక్తిని జవాబుదారీగా ఉంచుతారని ఆయన అన్నారు.
అతను మెహ్రీన్ భవిష్యత్తు బావుండాలని తనకు శుభాకాంక్షలు తెలిపాడు. మెహ్రీన్ .. ఆమె కుటుంబానికి ప్రేమ ఆనందం తప్ప నేను ఏమీ కోరుకోను. నేను ఎల్లప్పుడూ ఆమె కుటుంబం స్నేహితులపై అత్యున్నత గౌరవం కలిగి ఉంటాను. మా సంతోషకరమైన అనుభవాలను ఆదరిస్తాను. మెహ్రీన్ తన భవిష్యత్ ప్రాజెక్టులు .. కెరీర్ పరమైన ఆలోచనలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను“ అని భవ్య రాశారు. మార్చి 12 న జైపూర్ లో మెహ్రీన్- భవ్యా నిశ్చితార్థం జరిగింది. నాలుగు నెలల్లో వారు పూర్తిగా విడిపోయామని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది.