ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

కాంగ్రెస్ రైతుల పక్షమే అయితే.. పంజాబ్ లో ఎందుకు ఓడిపోయింది: కేటీఆర్

కాలం చెల్లిన కాంగ్రెస్ తో పొత్తుకు దేశంలోనే ఎవరూ సిద్ధంగాలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. పొత్తులు గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవని రాహుల్ తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తారా..? అని ఎద్దేవా చేశారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘తెలంగాణలో గాంధీ భవన్ ను గాడ్సేకు అప్పగించారు. ఏఐసీసీ అంటే.. ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ. రైతు ఆత్మహత్యలు తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పింది. కాంగ్రెస్ గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్ లో ఎందుకు ఓడిపోయింది. 2018లో చెప్పిన అంశాలనే వరంగల్ డిక్లరేషన్ పేరుతో మళ్లీ చెప్పారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను రాహుల్ చదివారు. రుణమాఫీ చేశామో లేదో రైతులకు తెలుసు. రైతులకు కాంగ్రెస్ పాతర వేస్తే.. టీఆర్ఎస్ జాతర చేసింది. టీఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమ పధకాలు కాంగ్రెస్ హయాంలో ఇవ్వని’వని అన్నారు.

Exit mobile version