అసలు ఇప్పుడిదంతా ఎందుకంటే, ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తే.. అదిగో టీడీపీ – జనసేన పొత్తు.. అంటూ వైసీపీ నేతలు బొక్కబోర్లా పడి మరీ ఏడుపులూ పెడబొబ్బులూ పెట్టేసిన సంగతి తెలిసిందే.
వైసీపీ ఎమ్మెల్యే రోజా అయితే, ‘పొత్తుల్లేకుండా పోటీ చేయలేని జొన్నపొత్తులన్నీ..’ అంటూ సెటైరేసేశారు. ఇంకేముంది, జనసైనికులు.. జనసేన మద్దతుదారులు అటు వైసీపీ ఎమ్మెల్యే రోజా మీదా ఇటు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా తమదైన స్టయిల్లో జబర్దస్త్ పంచ్ డైలాగులు పేల్చేస్తున్నారు.
అఖండ.. అనకొండ.. పప్పుండ.. అంటూ రోజా సెటైర్లేసి తన వాక్చాతుర్యాన్ని చాటుకుంటే.. అఖండ.. జలగన్న ‘ముం..’ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అదేంటో వైసీపీ నేతలు స్వామి భక్తిని చాటుకునే క్రమంలో విపక్షాల మీద వెరైటీ సెటైర్లు వేస్తోంటే అవి కాస్తా రివర్స్ అయి.. వైసీపీ అధినేత మీద జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్‌కి కారణమవుతున్నాయి.
వైసీపీ అయినా, టీడీపీ అయినా మరో పార్టీ అయినా.. వున్నది ప్రజా సేవ చేయడానికి తప్ప బూతులు మాట్లడటానికి కాదు. వెటకారానికీ ఓ హద్దు వుంటుంది. కానీ, ఆ హద్దులు ఎప్పుడో చెరిపేశారు రాజకీయ నాయకులు. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్టు తయారైంది వ్యవహారం. అందుకే వైసీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థుల మీద సెటైర్లేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే మంచిది.