కరోనా లాక్ డౌన్ లో మోడీ ఫెయిల్యూర్ తో ఆయన ప్రభ ఒక్కసారిగా తగ్గిపోయింది. మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకింది. అప్పటి నుంచి సర్వేల్లో మోడీ ప్రభ తగ్గిపోయింది.అయినప్పటికీ మోడీని ఓడించి ప్రధాని పీఠం ఎక్కే సత్తా గల నేత దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. ప్రధాని నరేంద్రమోడీకి సరితూగే నేత ఎవరు అని తాజాగా సర్వే నిర్వహించగా ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి.
మోడీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఉన్నా ఆయన మోడీలో సగం మాత్రమే ఆదరణను చూరగొన్నారు. థర్డ్ ఫ్రంట్ అంటూ నేతలు హడావుడి చేస్తున్న మోడీని ఢీకొట్టేలా కనిపించడం లేదంటున్నారు.
తాజాగా ‘ప్రశ్నం సంస్థ’ 12 పెద్ద రాష్ట్రాల్లో 397 ఎంపీ నియోజకవర్గాలు 2309 అసెంబరల్ీ నియోజకవర్గాల్లో దాదాపు 20వేల మందితో ఓ సర్వే చేసింది. ఇందులో దేశంలోని 33శాతం మంది ప్రజలు మోడీకే జై కొడుతున్నారు. మోడీపై ఎంత వ్యతిరేకత ఉన్నా ఆయనకే మొదటి ఓటు వేస్తున్నారు.
ఇక మోడీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 17శాతం మంది ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. మోడీ ప్రజాదరణలో రాహుల్ గాంధీ సగం ఉన్నట్టుగా లెక్క. ఆ తర్వాత మమతా బెనర్జీకి 7శాతం యోగి ఆధిత్యనాథ్ కు 6.1శాతం ఎంకే స్టాలిన్ కు 3శాతం మంది ప్రధాని కాగలరు అని కీర్తినందించారు. అఖిలేష్ కు 2.2శాతం ఉద్దవ్ ఠాక్రేకు 2.1శాతం ఇలా నేతలకు పీఎం కాగలరని ఓట్లు వేశారు.
ఇక థర్డ్ ఫ్రంట్ అంటూ పీఎం కావాలని ఆశపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేవలం 0.7శాతం మంది మాత్రమే ఓటు వేయడం విశేషం. మోడీ తర్వాత చాలా మంది ఆప్షన్ రాహుల్ గాంధీ అని సర్వే తేల్చింది.