Advertisement

మోక్షజ్ఞ సినిమా విషయం ఎత్తితే చిర్రుబుర్రులాడుతున్నాడేంటి?

Posted : June 10, 2020 at 12:39 pm IST by ManaTeluguMovies

నేడు బాలకృష్ణ 60వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దాదాపు అన్ని ఇంటర్వ్యూల్లో కూడా బాలకృష్ణ ఎదుర్కొన్న ప్రశ్న మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు. ఈ విషయంలో బాలకృష్ణ ఇచ్చిన సమాధానాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఒక అద్బుతమైన కథను తయారు చేయించాను. త్వరలోనే ఎంట్రీ ఇస్తాడు అంటూ చెప్పగా మరో ఇంటర్వ్యూలో మాత్రం ఇప్పుడే తొందర ఎందుకు అన్నట్లుగా మాట్లాడాడు.

ఒక ఇంటర్వ్యూలో పూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట కదా అంటూ యాంకర్‌ ప్రశ్నించగా పూరి మాత్రమే కాకుండా ఉప్మా, దోశ, ఇడ్లీల పేర్లు కూడా చెప్పండి అంటూ కామెడీ చేశాడు. మొత్తానికి మోక్షజ్ఞ సినీ రంగం ఎంట్రీ విషయంలో ఇంకా బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకోలేదా అంటే అవును అనే అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మోక్షజ్ఞ ఇటీవల ఫొటోలు వీడియోలు చూస్తే చాలా లావుగా కనిపిస్తున్నాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా లావుగానే కనిపిస్తున్నాడు. సినిమాలపై ఆసక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పటికే లావు తగ్గేవాడు. కాని ఇప్పటి వరకు లావు తగ్గే ఆలోచనే మోక్షజ్ఞ చేయడం లేదు. కనుక అసలు అతడికి సినిమాలు చేయాలనే ఆసక్తి ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కాని నందమూరి ఫ్యాన్స్‌ మాత్రం మోక్షజ్ఞ 2022లో ప్రేక్షకుల ముందుకు వస్తాడనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

ఢిల్లీ ఎవరికి మద్దతిస్తుంది ? ప్రజలు ఎవరికి పట్టం కడతారు ? | Special Focus On Delhi Politics

Posted : April 24, 2024 at 10:39 pm IST by ManaTeluguMovies

ఢిల్లీ ఎవరికి మద్దతిస్తుంది ? ప్రజలు ఎవరికి పట్టం కడతారు ? | Special Focus On Delhi Politics

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement