ఈ సుదీర్ఘ ప్రయాణంలో మోనాల్ కు బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. ఆమె అఖిల్ లేదా అభిజిత్‌లలో ఒకరితో ప్రేమ వ్యవహారం నడిపించాలి. అది కుదరకుంటే మరెవ్వరితో అయినా కూడా హగ్ లు కిస్ లు ఇవ్వాలి. మొత్తానికి ఇంట్లో ఎప్పుడు నీ వల్ల గొడవలు లేదా మరేదైనా జరగాలి అనేది ఆమెకు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ గా తెలుస్తోంది. ఆసీక్రెట్ టాస్క్ ను సోహెల్ పర్వాలేదు అన్నట్లుగా సక్సెస్ చేసిందనే అనుకుంటున్నారు. ఆమె సరిగా టాస్క్ చేయకుంటే బిగ్ బాస్ అయిదవ లేదా ఆరవ వారంలోనే ఎలిమినేట్ చేసేవాడు. ఆమె వల్ల ప్రయోజనం కలిగింది కనుకే ఇన్ని వారాలు ఉంచాడు అనేది కొందరి మాట.