ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరిచే రాష్ట్రాలివే

అక్టోబర్ మిడిల్ నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించింది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు థియేటర్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే అందుకు రకరకాల సమాధానం వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా కొన్ని చోట్ల థియేటర్లు ఓపెన్ చేసినా చాలా రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకూ వేచి చూసే ధోరణిని ఎగ్జిబిటర్లు అనుసరించనున్నారట.

వ్యాయామశాలలు… రెస్టారెంట్లు .. షాపింగ్ మాల్ లకు 50 శాతం సామర్థ్యంతో పాటు ఇతర ముందు జాగ్రత్త పరిమితులతో పనిచేయవలసి ఉంటుంది. అదేవిధంగా రూల్స్ ని థియేటర్లకు వర్తింపజేస్తున్నారు. నిజానికి ఇతర రంగాలతో పోలిస్తే సినిమా హాళ్ళపై ఆంక్షలు వాస్తవానికి ఈ వ్యాపారానికి అనుకూలంగా లేవు అటువంటి షరతులతో కూడిన పునః ప్రారంభం కంటే లాక్డౌన్ తక్కువ నష్టాన్ని కలిగిస్తుందని థియేటర్ యజమానులు విశ్లేషిస్తున్నారు.

అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్లను అనుమతించినా… కంటైన్ మెంట్ జోన్లలోని సినిమాస్ తిరిగి తెరవబడవు. సగం సీటింగే అయినా మొదట ప్రేక్షకుల లోపలికి రావటానికి ఇష్టపడరు. వాస్తవానికి జనం లోనికి ప్రవేశించే ముందు స్కాన్ చేసి ప్రతి ప్రదర్శనకు ముందు తరువాత సినిమా హాళ్ళను శుభ్రపరిచే వ్యాయామం చేయడం కఠినమైనది.

ఈ పరిస్థితిలో కొన్ని పెద్ద రేంజ్ సినిమాల మేకర్స్ తమ సినిమాలను విడుదల చేయడానికి 2021 వేసవి వరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రవేశ రేట్లు పెంచడానికి స్కోప్ లేనందున.. సినిమా ఎగ్జిబిషన్ ట్రేడ్ అంత లాభదాయకంగా మారబోదని విశ్లేషిస్తున్నారు.

ఇంకా సినిమా హాళ్ళకు ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే … అన్లాక్ 5.0 మార్గదర్శకాలతో సినిమా వ్యాపారాన్ని తిరిగి తెరవడానికి అనుమతించగా.. కేంద్రం తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ముందుకు సాగడానికి ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు.

కొన్ని రాష్ట్రాలు అక్టోబర్ 30 వరకు వేచి ఉండాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు ఉత్తరాదిన దిల్లీ.. ఉత్తర ప్రదేశ్.. పంజాబ్… పశ్చిమ బెంగాల్ … ఛత్తీస్గర్.. ఉత్తరాఖండ్… బీహార్… గోవా.. హిమాచల్ ప్రదేశ్… కర్ణాటక… గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి థియేటర్లను ప్రారంభించటానికి ముందుకు వచ్చాయి. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు థియేటర్లను తెరవనున్నాయి.

Exit mobile version