ఆమె పిలిచి మరీ డబ్బులిచ్చేది
“మేం ముగ్గురం అన్నదమ్ములం, హాస్టల్‌లో ఉండేవాళ్లం. అవినాష్ అన్నయ్య టెన్త్‌లో ఉన్నప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నాను. స్కూల్ డేస్‌లో అట్రాక్షన్ ఉండేది. కాబట్టి అన్నయ్య ఓ అమ్మాయిని ప్రేమించాడు, ఆమె చుట్టూ తిరిగేవాడు. స్కూల్‌కు వచ్చినా కూడా ఆమెపైనే ఫోకస్ పెట్టేవాడు, ఆమె ఎక్కడకు వెళ్తే అటు ఫాలో అయ్యేవాడు. అప్పుడు నేను మా అన్న దాగ్గరకు వెళ్లి రూపాయి ఇవ్వు మైసూర్ పాక్ కొనుక్కుంటా, రెండు రూపాలిస్తే సోనీ పాపడ్ కొనుక్కుంటా అని అడిగేవాడిని. వాడేమో లేవు పో, నేనివ్వను అనేవాడు. అప్పుడు ఆ అమ్మాయి నన్ను పిలిచి రూపాయి కావాలా అంటూ డబ్బులిచ్చేది”
అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అయింది
“దీంతో ఏదైనా అవసరం ఉంటే అన్నయ్య దగ్గరకు వెళ్లేవాడిని కాదు. అక్కా అక్కా అంటూ ఆమె దగ్గరకే వెళ్లి తీసుకునేవాడిని. అప్పుడు ఆ వరసలు తెలీక అక్కా అని పిలిచేవాడిని. తర్వాత అన్నయ్య చదువైపోయింది. నేను పదో తరగతికి వచ్చాను, అప్పుడు తెలుసుకున్నా, ఆ అమ్మాయిని లవ్ చేశాడని! కానీ ఆ అమ్మాయిని బాగా ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. కానీ కొన్ని కరాణాల వల్ల బ్రేకప్ అయింది. అయితే ఆ కారణాలేంటో తెలీదు. బ్రేకప్ తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. మిమిక్రీ, స్టేజీ షోలు చేసేవాళ్లం. అన్నయ్య టాలెంట్ చూసి ప్రిన్సిపాల్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. అలా ఇక్కడివరకు వచ్చాడు. అతడిని ఈ సీజన్ విజేతగా చూడాలనుకుంటున్నాను” అని అజయ్ చెప్పుకొచ్చాడు.