అయితే ఐటెం సాంగ్స్ చేసేటప్పుడు తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది ముమైత్. ఆమె ఇటీవలే డ్యాన్స్ + అనే షో లో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బయోపిక్ రౌండ్ లో సిల్క్ స్మిత పాటకు డ్యాన్స్ చేసిన ముమైత్ ఎమోషనల్ అయింది.
తాను సినిమాల్లోకి రావడానికి సిల్క్ స్మిత ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంది. అలాగే అప్పుడు తాను ఐటెం సాంగ్స్ చేస్తే విమర్శించిన వాళ్ళు ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు అని ఎమోషనల్ అయింది.