నితిన్ అంధధూన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెల్సిందే. మేర్లపాక గాంధీ దర్శకుడిగా ఎంపికయ్యాడు. సినిమా లాక్ డౌన్ కు ముందు ముహూర్తం జరుపుకుంది కూడా. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా షూటింగ్ ఈ పాటికి మొదలయ్యేది. సెప్టెంబర్ లేదా ఇయర్ ఎండ్ కు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.
అయితే అంధధూన్ చిత్రంలో హీరోయిన్ కు పెద్ద స్కోప్ ఏం లేదు. హీరోతో ఒక రొమాంటిక్ సీన్ తప్ప ఆమె గురించి చెప్పుకోవడానికేం ఉండదు. సినిమా అంతా హీరో, టబు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మరి ఎందుకని నభ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందనేది అర్ధం కాని ప్రశ్న. ఈ ఏడాది విడుదలైన డిస్కో రాజాలో కూడా ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను చేసింది ఈమె. ఆ సినిమా పరాజయం ఆమె కెరీర్ కు కొంచెం ఎఫెక్ట్ ఇచ్చిందనే చెప్పాలి. మరి తనకు ప్రాధాన్యత లేని సినిమాలను ఎంపిక చేసుకుని నభ ఏమైనా తప్పు చేస్తోందా?