అయితే నభ నటేష్ మాత్రం షూటింగ్స్ ను బాగా మిస్ అవుతోందిట. ఈ లాక్ డౌన్ లో చాలా ఫ్రీ అయిపోయాను. నిజానికి చాలా బోర్ కొడుతోంది. టివి చూస్తున్నాను, పెయింటింగ్స్ వేసుకుంటున్నాను, బాగా చిల్ అవుతున్నాను. అయితే షూటింగ్స్ ను బాగా మిస్ అవుతున్నాను. ఎప్పుడెప్పుడు తిరిగి సెట్స్ లో అడుగుపెడతానా అని ఉంది. అందుకనే మా మూవీ యూనిట్ వాట్సాప్ గ్రూప్ లో ఎప్పుడు షూటింగ్ మొదలైతే అప్పుడు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నానని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాను. ఏదేమైనా వీలైనంత తొందరగా ఈ షూటింగ్స్ మొదలవ్వాలి కోరుకుంటున్నాను అని తెలిపింది నభ నటేష్.
సోలో బ్రతుకే సో బెటరు చిత్రం పూర్తవ్వడానికి మరో 10 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంది. షూటింగ్స్ మొదలైన దాన్ని బట్టి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ప్లాన్ చేయాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.