ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నాగ్ అశ్విన్ హాలీవుడ్ తరహా స్టంట్ ప్రయోగం

ఫైట్స్ మేకింగ్ అనేది అంత సులువైనదేమీ కాదు. ఎంతో రిస్క్ తో కూడుకున్నది. హాలీవుడ్ లాంటి చోట భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఒకరికి మించి స్టంట్ డైరెక్టర్లు నిరంతరం ఎంతో జాగ్రత్తగా పని చేస్తుంటారు. వారికి సబ్ అసిస్టెంట్లు ప్రతిదీ చేసి చూపిస్తుంటారు. ఇక తారాగణాన్ని ఎలాంటి రిస్కులోనూ వేయకుండా కాపాడాల్సిన బాధ్యత స్టంట్ డైరెక్టర్ కి ఉంటుంది.

అధునాతన సాంకేతికతకు తగ్గట్టే ఫైట్స్ కొరియోగ్రఫీలోనూ చాలా మార్పులు వచ్చాయని ఫైట్ మాస్టర్స్ చెబుతుంటారు. ఇటీవలి ఆర్.ఆర్.ఆర్ స్టంట్స్ విధానం పరిశీలించాక కూడా ఇది అర్థమవుతుంది. జక్కన్న పూర్తిగా వీ.ఎఫ్.ఎక్స్ – గ్రాఫిక్స్ ఆధారిత ఫైట్స్ ని లార్జర్ దేన్ లైఫ్ హీరోల్ని ఫైట్స్ లో ఎలివేట్ చేశారు. ఇది నిజానికి బాలీవుడ్ వాళ్లను కూడా ఆలోచింపజేసేంతగా ప్రభావితం చేసింది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటివి హాలీవుడ్ లో మాత్రమే రెగ్యులర్ గా చూపిస్తుంటారు. ఇండియన్ ఫిలిం మేకింగ్ లో ఇప్పటివరకూ లేనే లేదు.

ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ – కే కోసం నాగ్ అశ్విన్ కూడా అసాధారణమైన ఫీట్స్ వేస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చిదిద్దుతూనే యాక్షన్ పరంగా మరో లెవల్ చూపించాలని తహతహలాడుతున్నారు. తాజా ప్రకటన గమనిస్తే ఇది అర్థమవుతోంది. ఇప్పటికే ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లను హైర్ చేసుకుని మరీ వర్క్ చేస్తున్నా.. ప్రతిభావంతులైన స్టంట్ యాక్టర్స్ కోసం పిలుపునిచ్చరు. ఎనిమిది రకాల స్టంట్స్ వచ్చిన నటుల కోసం చూస్తున్నామని తెలిపారు. భారతీయ కళతో పాటు ఇతర మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్నవారు గాని లేదా ఈ విద్యలపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తమ టాలెంట్ ని నిరూపిస్తే డార్లింగ్ సినిమాలో ఛాన్స్ దక్కినట్టే. ప్రతిభను నిరూపించుకోవాలనుకునే ఔత్సాహికులకు ఇది సిసలైన ఆఫర్ అని భావించాలి.

ప్రాజెక్ట్ K నెవ్వర్ బిఫోర్ అనేలా..

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైన్స్ పిక్షన్ మూవీ `ప్రాజెక్ట్ K` భారతీయ సినీపరిశ్రమలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లలో ఒకటిగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం పని చేస్తున్న కాస్టింగ్ కానీ టెక్నాలజీ కానీ హై ఎండ్ లో భారీ బడ్జెట్లతో కూడుకున్నది అన్నది విధితమే. ప్రాజెక్ట్ K చిత్రం షూటింగ్ కోసం ప్రత్యేక సాంకేతికతను టీమ్ ఉపయోగిస్తోంది. ఈ చిత్రం DIY Arri Alexa టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరిస్తున్నారు. ఈ అధునాతన సాంకేతికతను ఉపయోగించిన మొదటి భారతీయ చిత్రం ఇదే. ఈ సాంకేతికత సినిమాటోగ్రఫీకి సంబంధించినది. ఇది చిత్రానికి దృశ్యమాన అనుభవాన్ని (విజువల్ ఎక్స్ పీరియెన్స్) మెరుగుపరుస్తుంది. ప్రాజెక్ట్ K అనేది భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సాధ్యమైనంత ఉత్తమమైన అవుట్ పుట్ ను అందించడానికి మేకర్స్ ప్రపంచ స్థాయి సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు.

ఫైట్స్ – కాస్ట్యూమ్స్- భారీ సెట్లు ఇలా ప్రతిదీ ఖరీదైనవే. విజువల్ గ్రాఫిక్స్ మాయాజాలం పరంగానూ హాలీవుడ్ స్టాండార్డ్స్ ని అనుసరిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమా అని నాగ్ అశ్విన్ ఆరంభమే ప్రకటించారు. అందుకు తగ్గట్టు భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ తనకు ఎంతో స్పెషల్ యూనిక్ అని దీపిక పదుకొనే తెలిపింది. నాగ్ అశ్విన్ యూనిక్ థాట్ ని కూడా ప్రశంసించింది. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ 3డి- సలార్ కూడా విజువల్ మాయాజాలంతో కట్టిపడేసేవే. అయితే వాటన్నిటి కంటే రిచ్ గా అసాధారణ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతోంది.

Exit mobile version