కొన్ని మీడియా సంస్థలు చై – సామ్ విడాకులపై చర్చలని కూడా నిర్వహించారు. కారణం ఇదంటే ఇదంటూ ఏదో ఒక అంశాన్ని ఎత్తి చూపుతూ నెట్టింట వైరల్ చేశారు. అంతే కాకుండా సామ్ నటించడం అందులోనూ ప్రధానంగా బోల్డ్ పాత్రల్లో నటించడం నాగచైతన్యకు నాగార్జునకు పెద్దగా నచ్చలేదని ఆ కారణంగానే ఆమెని వద్దనుకున్నారని కలిసి వుండాలంటే తమ షరతులకు అంగీకరించి సినిమాలకు దూరంగా వుండాలన్నారని రక రకాల వార్తలు పుట్టుకొచ్చాయి.
వీటిపై సమంత కోర్టుని కూడా ఆశ్రయించడం తెలిసిందే. ఇదిలా వుంటే చై – సామ్ విడిపోతున్నట్టుగా ప్రకటించిన వెంటనే వారిపై వచ్చిన వార్తలపై తాజాగా కింగ్ నాగార్జున స్పందించారు. `బంగార్రాజు` సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
సమంత – నాగచైతన్య విడిపోయిన తరువాత వారిపై సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంత మంది ప్రస్తుతం వున్న రోజుల్లో కావాలనే ఇలాంటి చెత్త వార్తల్ని సృష్టిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ లో ఇలాంటి వార్తలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తుంటాయి. నాపై ఇలాంటి అసత్య వార్తలు రాసినా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే నా ఫ్యామిలీ గురించి పెగెటివ్ గా వార్తలు రాయడం మాత్రం బాధించింది.
పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్న సూక్తిని నేను నమ్ముతాను. అందుకే నాపై ఎలాంటి వార్తలు వచ్చినా పెద్దగా పట్టించుకోను. కానీ ఈ సారి నా ఫ్యామిలీ గురించి చెడుగా వార్తలు రాయడం నన్ను ఇబ్బందికి గురిచేసిందన్నారు నాగార్జున. అలాంటి చెత్త వార్తల్ని తాను అసలు పట్టించుకోనని నాగచైతన్య కూడా స్పష్టం చేయగం గమనార్హం.