నాగచైతన్య మరియు సమంత కలిసి కొద్ది సంవత్సరాలు మాత్రమే వైవాహిక జీవితాన్ని గడిపినా కూడా రాబోయే 10 నుండి 20 సంవత్సరాల వరకు వారు జోడి గురించి జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. సమంత నాగ చైతన్య మళ్లీ కలుస్తారేమో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనాలకు తాజాగా సమంత చేసిన అన్ ఫాలో తో ఆశల పై నీళ్లు చల్లినట్లు చేసింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత మరియు నాగచైతన్య కనీసం స్నేహితులుగా కూడా ఉండే అవకాశం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది.