ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నాగ చైతన్య లవ్ స్టోరీ ఈ ఏడాది లేనట్లే!

అక్కినేని నాగ చైతన్య గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది సమ్మర్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ చిత్రాన్ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు చైతన్య. అయితే కరోనా తన ప్లాన్స్ మొత్తాన్ని తారుమారు చేసింది. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. మరో రెండు నెలల వరకూ షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కానీ లవ్ స్టోరీ టీమ్ లో చాలా మంది ఇప్పుడే షూటింగ్ లకు రావడానికి సముఖంగా లేరని తెలుస్తోంది.

దీంతో ఎంత లేదన్నా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కు కానీ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు. అయితే శేఖర్ కమ్ముల సహజంగానే స్లో గా సినిమా తీసే వ్యక్తి. లవ్ స్టోరీ ప్రొడక్షన్ కు, పోస్ట్ ప్రొడక్షన్ కు మొత్తంగా కలుపుకుని చూసుకుంటే మూడు నెలల సమయమైనా కావాలి. సో డిసెంబర్ కు కానీ లవ్ స్టోరీ సిద్ధమయ్యే అవకాశం లేదు. దీన్ని బట్టి చూసుకుంటే వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ, లేదా సమ్మర్ కు కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు

Exit mobile version