ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

చైతూ 20.. ప్ర‌క‌ట‌నే త‌రువాయి

అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈపాటికి ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వ్వాల్సింది. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి షూటింగులు ఆగిపోవ‌డంతో సినిమా వెన‌క్కి వెళ్లిపోయింది.

మ‌రోవైపు ఈ సినిమాను పూర్తి చేసి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొద‌లుపెట్టాల‌ని చైతూ వేసుకున్న ప్లాన్ కూడా ఫ‌లించ‌లేదు. అనుకోకుండా మ‌హేష్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం త‌లుపు త‌ట్ట‌డంతో అత‌ను చైతూ మూవీని తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింది.

ఎలాగూ ఖాళీగా ఉండ‌టంతో చైతూ వేరే ప్ర‌త్యామ్నాయాలు ప‌రిశీలించాడు. త‌న‌కు మ‌నం లాంటి మ‌ర‌పురాని సినిమాను అందించిన విక్ర‌మ్ కుమార్ క‌నిపించాడు. కొన్ని రోజులుగా వీరి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం చైతూ-విక్ర‌మ్ మ‌ధ్య సినిమా చేయ‌డానికి అంగీకారం కుదిరింది. క‌థా చ‌ర్చ‌లు కూడా ముగిశాయి. స్క్రిప్టు ఫైనల్ కూడా అయిన‌ట్లు తెలిసింది. చైతూకిది 20వ సినిమా అవుతుంది. ఈ సినిమా గురించి ప్ర‌క‌ట‌నే త‌రువాయి అని తెలుస్తోంది. త‌న‌కు ఇప్ప‌టికే ఓ క‌మిట్మెంట్ ఉన్న దిల్ రాజు బేన‌ర్లో చైతూ ఈ సినిమా చేయ‌నున్నాడు.

మ‌నం త‌ర్వాత విక్ర‌మ్ నుంచి ఆయ‌న స్థాయికి త‌గ్గ సినిమా రాలేదు. హ‌లో డిజాస్ట‌ర్ అయింది. గ్యాంగ్ లీడ‌ర్ కూడా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. దీంతో మ‌ళ్లీ త‌నేంటో చాటిచెప్పే సినిమా తీయాల‌ని విక్ర‌మ్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. చైతూ ఆల్రెడీ గ‌త ఏడాది మ‌జిలీతో మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

ప్ర‌స్తుతం చేస్తున్న ల‌వ్ స్టోరీ ప్రామిసింగ్‌గా క‌నిపిస్తోంది. ఈ వ‌రుస‌లో విక్ర‌మ్ సినిమా కూడా క్లిక్ అయితే అత‌ను మ‌రో స్థాయికి వెళ్ల‌డం ఖాయం. ఇంత‌కీ ఈ జోడీ త‌మ‌కు క‌లిసొచ్చిన ల‌వ్ స్టోరీనే చేస్తుందా.. కొత్త‌గా ఏమైనా ట్రై చేస్తుందా అన్న‌ది చూడాలి.

Exit mobile version