ఇంకా తొలి సినిమా కూడా విడుదల కాకుండానే కేతిక శర్మ తన రెండో సినిమాను చేజిక్కించుకుంది. నాగ శౌర్య హీరోగా ఒక స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సంతోష్ జాగర్లపూడి అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను శరత్ మరార్, రామ్ మోహన్, సునీల్ నారంగ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేతిక శర్మను తీసుకున్నారు నిర్మాతలు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలుపెట్టనున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి