ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తిట్టించుకోవడమంటే నాగబాబుకి ఎంతిష్టమో!

జీ తెలుగులో “అదిరింది” కార్యక్రమం (జబర్దస్త్ కు కాపీ) లేకపోవడంతో నాగబాబు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. కరోనా వల్ల ఇటు పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు, గాడ్సే మీద చేసిన కామెంట్స్ తో పవన్ ఫైర్ అయ్యేసరికి జనసేనకు మరీ అంటీముట్టనట్టుగా ఉన్న నాగబాబు ఇటీవల బాలయ్య వ్యవహారంతో బాగా హైలెట్ అయ్యారు. కొందరు తిట్టారు, ఇంకొందరు పొగిడారు, మరికొందరు నొచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఓ డిఫరెంట్ సబ్జెక్ తో ట్విట్టర్ లో నెటిజన్ల ముందుకొచ్చారు మెగా బ్రదర్.

కాశ్మీర్ లో ఒక హిందూ పండిట్, సర్పంచి కూడా అయిన అజయ్ ని ఎవరో చంపేశారట, దానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదట. ఈ సంఘటన తనకు ఆలస్యంగా తెలియడానికి కారణం కూడా మీడియానేనంటూ అంతెత్తున ఎగిరిపడ్డారు నాగబాబు. అమెరికాలో నల్లజాతీయుడు చనిపోతే స్పందించే పెద్దలు, కాశ్మీర్ పండిట్ చనిపోతే ఎందుకు స్పందించరంటూ లాజిక్ తీశారు.

అందులోనూ నాగబాబు వాడిన పదాలు మామూలుగా లేవు.. హిందూమతం, హిందువులు, హిందువుల రక్షణ, హిందూ చక్రవర్తుల పాలన అంటూ తనకు తెలిసిన, తెలియని అన్ని విషయాలను టచ్ చేశారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ఇలాంటివన్నీ తగ్గిపోయాయని చెబుతూనే.. ఈ విషయాన్ని కూడా వారెందుకో పట్టించుకోలేదని వాపోయారు. హిందూ అనే పదాన్ని ప్రొజెక్ట్ చేయడానికే నాగబాబు ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

ఇక చూడండి.. నెటిజన్లు నాగబాబుని ఓ ఆటాడేసుకున్నారు. కాశ్మీర్ పండిట్ సంగతి పక్కనపెట్టండి, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది దళితులపై దాడులు జరుగుతున్నాయి వాటి మాటేంటి అని ప్రశ్నించారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా రాజకీయాలు చేయాలని జనసేన చెబుతోంది, మరి హిందూ మతాన్ని అంతలా వెనకేసుకొస్తున్న నాగబాబుకి జనసేన సిద్ధాంతాలు తెలియవా అని విమర్శించారు.

కాశ్మీర్ లో అజయ్ పండిట్ ని చంపింది టెర్రరిస్ట్ లు. ముష్కర మూకల దాడిలో ఒక్క అజయ్ పండిట్ ఒక్కరే కాదు, చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాశ్మీర్ లోని స్థానికులు అకారణంగా చనిపోతున్నారు. మరి వీరందరి కులాలు తెలుసుకుని, మతాలు ఎంక్వయిరీ చేసి ఆ తర్వాత టెర్రరిస్ట్ లను తిట్టాలా? టెర్రరిస్ట్ ల చేతిలో చనిపోయినవారిలో హిందువులెంతమంది, ఇతర మతాలకు చెందినవారెంతమంది అని లెక్కతీయాలా? ఇంత సడన్ గా నాగబాబుకి హిందూత్వం ఎందుకు పూనినట్టు.

గాడ్సేని పొగిడి ఇబ్బందుల పాలైంది చాలదన్నట్టు.. ఇప్పుడు కాశ్మీరీ పండిట్ వ్యవహారం తెరపైకి తెచ్చి అభాసుపాలవుతున్నారు నాగబాబు. ఆయన వాలకం చూస్తుంటే.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ ని టచ్ చేసి వార్తల్లో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారేమో. ఇలాంటి పబ్లిసిటీ ట్రిక్స్ ఇప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మకే ఉన్నాయని అనుకున్నారంతా.. ఇప్పుడు నాగబాబు కూడా ఆయనకి జత కలిశారు, ఆయన్ని మించిపోతున్నారు కూడా.

Exit mobile version