ఇలాంటి నేపథ్యంలో నాగబాబు యూ ట్యూబ్ చానెల్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. జబర్దస్త్, అదిరింది షో ల మాదిరిగా నాగబాబు తన చానెల్ లో ఫన్ అండ్ కామెడీ షో ను స్టార్ట్ చేయబోతున్నారు అన్నది ఆ ప్రకటన చూడగానే అర్థం అయ్యే విషయం. కామెడీ నటులు, కామెడీ రైటర్లు కావాలని నాగబాబు పిలుపు నిచ్చారు.
నాగబాబు తన యూ ట్యూబ్ చానెల్ ను వీలయినంత పాపులర్ చేసారు. దాదాపు మూడు లక్షల మంది సబ్ స్క్రయిబర్లు వున్నారు. తరచు సంచలన పోలిటికల్ కామెంట్లతో నాగబాబు ట్రెండ్ లో వుంటూ వస్తున్నారు. ఇప్పుడు మరి ఈ కామెడీ స్క్రిట్ లను అందించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో మరి?
పైగా ప్రస్తుతం అదిరింది షో ను చేస్తున్నారు. ఆ షో చేస్తూ, మళ్లీ స్వంతగా ఇలా చేస్తే జీ టీవీ ఏమనుకుంటుందో? లేదా నేరుగా జీటీవీ అదిరింది కోసం కాకుండా, ఇలా తీసుకుని, ఫ్రెషర్స్ ను ఓ ఎంట్రీ మోడ్ గా తన చానెల్ ను తయారు చేయాలని అనుకుంటున్నారేమో? మొత్తానికి ఏదో వుంది వ్యవహారం.