ఈమద్య కాలంలో హీరోలు నిర్మాతలుగా మారడం చాలా కామన్ అయ్యింది. అయితే నిర్మాతలు అయిన హీరోలు వారి తండ్రితో సినిమాలు నిర్మించడం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇండియన్ సినీ చరిత్రలో ఈ అరుదైన సంఘటనలు కొన్ని మాత్రమే ఉన్నాయి. మన తెలుగు స్క్రీన్‌పై ముగ్గురు హీరోలు ఈ ఘనత సాధించారు. అందులో మొదటి వాడు నాగార్జున. ఈయన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తండ్రి నాగేశ్వరరావుతో పలు సినిమాలను నిర్మించాడు.
తండ్రి హీరోగా కొడుకు నిర్మాణంలో సినిమాలు ఆ తరం నుండే ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత హరికృష్ణ కూడా తన తండ్రి నందమూరి తారక రామారావుతో సినిమాలు నిర్మించాడు. నిర్మాణ వ్యవహారాలు మొత్తం కూడా హరికృష్ణకు అప్పగించి ఎన్టీఆర్ సినిమాలో నటించేవారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే చరణ్ తన తండ్రి చిరంజీవితో ఖైదీ నెం.150, సైరా చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం ఆచార్య చిత్రంను కూడా చిరంజీవితో చరణ్ నిర్మిస్తున్నాడు. ఇలా వరుసగా చిరంజీవితో సినిమాలు నిర్మిస్తూ చరణ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. నాగార్జున, హరికృష్ణల తర్వాత మళ్లీ ఇప్పుడు చరణ్‌కు ఆ ఘనత దక్కింది. భవిష్యత్తులో ఈ ఘనత ఏ హీరో అయినా దక్కించుకుంటాడా అనేది చూడాలి.