Advertisement

అయిదు నెలల తరువాత మేకప్

Posted : July 27, 2020 at 10:39 pm IST by ManaTeluguMovies

కరోనా రావడంతో మార్చి నెలలో షూటింగ్ లు అన్నీ ఆగిపోయాయి. అప్పటి నుంచి సినిమా జనాలు మొహానికి మేకప్ మరచిపోయారు. సీనియర్ హీరోలు అందరూ గదులు దాటి బయటకు రావడం లేదు. హీరోలు చాలా మంది గడ్డాలు, జులపాలు పెంచేసారు.- మళ్లీ షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో? ఎప్పుడు మొహాలకు మేకప్ వేసి మేకోవర్ అవుతారో తెలియదు.

ఇలాంటి నేపథ్యంలో హీరో నాగార్జున మొహానికి మేకప్ వేసుకున్నారు. మార్చి తరువాత మళ్లీ మొహానికి మేకప్ వేసుకోవడం ఇదే తొలిసారి. బిగ్ బాస్ ప్రోమో కోసం ఆయన మేకప్ వేసుకుని, అన్నపూర్ణలో ఓ చిన్న షూట్ లో పాల్గొనట్లు తెలుస్తోంది.

లిమిటెడ్ క్రూ తో ఈ ప్రోమో షూట్ జరిగింది. బిగ్ బాస్ ను కూడా ఈ సారి కాస్త తక్కువ మంది పార్టిసిపెంట్స్ తో, తక్కువ వారాల నిడివితో తయారు కాబోతోంది. అన్ని విధాలా ఆరోగ్య పరిక్షలు చేసిన తరువాత బిగ్ బాస్ లోకి పార్టిసిపెంట్స్ ను పంపిస్తారు. వారానికి రెండు సార్లు మాత్రమే నాగ్ స్టేజ్ మీదకు వస్తారు. అప్పుడు కూడా వీలయినంత మంది లిమిటెడ్ క్రూ తో షూట్ చేస్తారు.


Advertisement

Recent Random Post:

విశాఖ పశ్చిమలో గెలుపెవరిది..? | Vizag | Gelupevaridi | YCP | TDP | Janasena | BJP

Posted : April 15, 2024 at 6:57 pm IST by ManaTeluguMovies

విశాఖ పశ్చిమలో గెలుపెవరిది..? | Vizag | Gelupevaridi | YCP | TDP | Janasena | BJP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement