ఇలాంటి నేపథ్యంలో హీరో నాగార్జున మొహానికి మేకప్ వేసుకున్నారు. మార్చి తరువాత మళ్లీ మొహానికి మేకప్ వేసుకోవడం ఇదే తొలిసారి. బిగ్ బాస్ ప్రోమో కోసం ఆయన మేకప్ వేసుకుని, అన్నపూర్ణలో ఓ చిన్న షూట్ లో పాల్గొనట్లు తెలుస్తోంది.
లిమిటెడ్ క్రూ తో ఈ ప్రోమో షూట్ జరిగింది. బిగ్ బాస్ ను కూడా ఈ సారి కాస్త తక్కువ మంది పార్టిసిపెంట్స్ తో, తక్కువ వారాల నిడివితో తయారు కాబోతోంది. అన్ని విధాలా ఆరోగ్య పరిక్షలు చేసిన తరువాత బిగ్ బాస్ లోకి పార్టిసిపెంట్స్ ను పంపిస్తారు. వారానికి రెండు సార్లు మాత్రమే నాగ్ స్టేజ్ మీదకు వస్తారు. అప్పుడు కూడా వీలయినంత మంది లిమిటెడ్ క్రూ తో షూట్ చేస్తారు.