Advertisement

ఈ సమయంలో కూడా ఇది నాకు నవ్వు తెప్పించింది : నమ్రత

Posted : May 23, 2021 at 11:05 am IST by ManaTeluguMovies

కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. చాలా మంది మొహాన నవ్వు లేక వారాలు అవుతుంది. కొందరు నెలల తరబడి జీవితాలను నెట్టుకు వచ్చేందుకు బాధలు అనుభవిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా టెన్షన్ టెన్షన్ అన్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో కూడా నాకు ఈ ఫొటోను చూస్తే నవ్వు వస్తుంది అంటూ మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ ఈ ఫొటోను షేర్‌ చేసింది. వారి కూతురు సితార చిన్నప్పటి ఫొటో అది. సితార చాలా క్యూట్‌ గా ఈ ఫొటోలో కనిపిస్తు నవ్వు తెప్పించే విధంగా ముద్దు పెట్టాలనిపించే విధంగా ఉంది.

మహేష్ బాబు గారాల పట్టి అయిన సితూపాప ప్రస్తుతం పెద్దగా అయ్యింది. పెద్ద పిల్లలకు సంబంధించిన ఏ ఫొటో అయినా చిన్నప్పటిది ఖచ్చితంగా భలే ఉందే అనిపిస్తుంది. సితార చిన్నపటి ఫోటో మరింతగా ఆసక్తికరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సీతూ పాప క్యూట్‌ నెస్ ఓవర్‌ లోడెడ్‌ అంటూ నెటిజన్స్ ఫొటోకు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఈ సమయంలో చాలా ప్రశాంతంగా ఈ ఫొటోను చూస్తే అనిపిస్తుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


Advertisement

Recent Random Post:

CM Jagan Bus Yatra : Jagan రోడ్ షో ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న Vishaka YCP | Memantha Siddham

Posted : April 21, 2024 at 7:04 pm IST by ManaTeluguMovies

CM Jagan Bus Yatra : Jagan రోడ్ షో ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న Vishaka YCP | Memantha Siddham

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement