అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వృద్ధులకు, దివ్యాంగులకు చాలా కష్టంగా మారింది. వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజన్లు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అలా క్యూలో నిలుచుంటే కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా ఎక్కువసేపు వాళ్ళు నిలుచో లేరు. ఈ నేపథ్యంలో ముంబై, భోపాల్ ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఉన్న చోటుకే వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. కారులోనే, ఇతర వాహనాలలో ఉన్నా కూడా అక్కడే టీకా అందిస్తున్నారు.
తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత చెబుతూ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ‘భోపాల్, ముంబైలోవ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. ఎంతో మంచి నిర్ణయమది. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు కారులోనే వ్యాక్సిన్ వేస్తున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కష్టకాలం నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోండి అని నమత్ర కోరారు.