ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నెలలోపే ఓటీటీకి నాంది

అల్లరి నరేష్‌ చాలా కాలం తర్వాత నాంది సినిమా తో సక్సెస్ ను దక్కించుకున్నాడు. నాంది సినిమా ను ఆహా వారు దక్కించుకున్నారు. సాదారణంగా అయితే థియేటర్లలో విడుదల అయిన సినిమాను కనీసం 50 రోజులు ఆగిన తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేయాల్సి ఉంటుంది. కాని నాంది సినిమాను మాత్రం నెల రోజుల లోపే విడుదల చేసేందుకు ఆహా వారు సిద్దం అవుతున్నారు. ఆహాలో ఇటీవల స్ట్రీమింగ్ అయిన క్రాక్‌ సినిమా కు భారీ విజయం దక్కింది. అందుకే ఈ సినిమా పై ఆహా వారు ఆశలు పెట్టుకున్నారు.

ఆహా ఖాతాదారులు ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. అమెజాన్‌ తో పోటీ పడి మరీ ఈ సినిమా ను ఆహా వారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. భారీ మొత్తం పెట్టినందుకు ఆహా కు ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది అనేది చూడాలి. అల్లరి నరేష్‌ దాదాపు పదేళ్ల పాటు సక్సెస్ లేక ఢీలా పడిపోయాడు. ఇక ఆయన కెరీర్ ఖతం అయ్యిందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా సినిమా సూపర్‌ హిట్ అయ్యింది. కామెడీ పాత్రల కంటే ఇలాంటి సీరియస్‌ పాత్రలను అల్లరోడు చేస్తే చూస్తారా అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version