అసలు విషయం ఏంటీ అంటే సినిమా షూటింగ్ సందర్బంగా వికాస్ కొట్టే సన్నివేశం ఉంది. నందిని రాయ్ ను అతడు కొడితే వెంటనే ఆమె కన్నీరు పెట్టుకోవాలి. మొదట రెండు మూడు టేక్ లు కొట్టినట్లుగా యాక్ట్ చేశాడు. అప్పుడు వెంటనే నాకు కన్నీరు రావడం లేదు. దాంతో నిజంగానే కొడితే రియల్ ఫీల్ ఉంటుందని.. అందుకే నిజంగా గట్టిగా మొహమాటం లేకుండా కొట్టేయమని చెప్పాను. దాంతో అతడు నిజంగానే నన్ను కొట్టాడు. ఆ సమయంలో నాకు నిజంగా కన్నీరు వచ్చాయని నందిని రాయ్ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సినిమా కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.