సితార ఎంటర్టైన్మెంట్స్ వారు శ్యామ్ సింగరాయ్ బడ్జెట్ విషయంలో పేచీలు పెట్టడంతో మరొకరి చేతికి సినిమా నిర్మాణం వెళ్లింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం తాజాగా దసరా సందర్బంగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది. నాని మరియు రాహుల్ సంకీర్తన్ ల కాంబోపై వెంకట్ బోయనపల్లి చాలా నమ్మకంగా ఉన్నాడట. అందుకే రూ.40 కోట్లు పెట్టేందుకు కూడా సిద్దం అయ్యాడట.
నానిని ఈ సినిమాలో విభిన్నంగా చూపించడంతో పాటు కోల్కత్తా బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నారు. ఎక్కువ డేట్లు కావాల్సి ఉండటంతో పాటు ఎక్కువగా బయట లొకేషన్స్ లో సినిమాను తీయాల్సి ఉంది. అందుకే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందబోతుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాతో నాని కెరీర్ బిగ్గెస్ట్ మూవీ గా నిలవబోతుంది. నాని సినీ కెరీర్ ఇప్పటి వరకు అంత భారీ బడ్జెట్ పెట్టలేదు. కనుక సితార ఎంటర్ టైన్మెంట్ వారు తప్పుకున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు మాత్రం నానిపై నమ్మకంతో సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.