ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

విజయ్ కు విలన్ గా నానిని అనుకున్నారా?

ఇళయథలపతి విజయ్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా డీసెంట్ మార్కెట్ ఉన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా తమిళంలో వరసగా బ్లాక్ బస్టర్లు సాధించి టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాడు. విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం మాస్టర్ ఎట్టకేలకు జనవరి 13న విడుదలవుతోంది. మాస్టర్ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్న విషయం తెల్సిందే.

ఇక మాస్టర్ లో విలన్ గా విజయ్ సేతుపతి నటించాడు. విజయ్, విజయ్ సేతుపతి స్క్రీన్ పై ఎలా కనిపిస్తారోనన్న ఆసక్తి అందరిలో ఉంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో విలన్ గా నానిని నటింపజేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చిందట.

ఈ చిత్రానికి రచయితగా పనిచేసిన రత్నకుమార్ ఈ విషయాన్ని రివీల్ చేసాడు. విజయ్ సేతుపతిని విలన్ గా ముందు నుండీ అనుకుంటున్నాం. అయితే ఆయన చేస్తాడో చేయడోనన్న డౌట్ అందరిలో ఉంది. అందుకే నానిని ఒక ఆప్షన్ గా అనుకున్నాం అని రివీల్ చేసాడు రత్నకుమార్.

Exit mobile version