నాని తొలి సినిమా ‘అష్టాచెమ్మా’కు మోహనకృష్ణే దర్శకుడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో చాలా మంచి పేరు సంపాదించిన నాని.. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మధ్యలో కొంత స్ట్రగులైనప్పటికీ అవకాశాలేమీ ఆగిపోలేదు. బ్రేక్ తర్వాత వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్లిపోయాడు. స్టార్ స్టేటస్ సంపాదించాడు. నాని సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘జెంటిల్‌మేన్’ లాంటి విలక్షణ చిత్రంతో అతడికి మంచి హిట్ ఇవ్వడమే కాదు.. నటుడిగా అతడిలోని కొత్త కోణాల్ని ఆవిష్కరించిన ఘనత కూడా ఇంద్రగంటిదే.
ఇప్పుడు ‘వి’ అనే మరో విలక్షణ చిత్రంతో నానిని ఇంకా కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు. కరోనా ప్రభావం లేకుంటే ఈపాటికే ఆ చిత్రం రిలీజ్ కావాల్సింది. ఐతే ఎప్పుడు రిలీజైనా ఈ సినిమా సూపర్ హిట్ అనే ధీమాతో ఉంది చిత్ర బృందం. ‘వి’ నానికి 25వ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఐతే నటుడిగా తన 50వ సినిమాకు కూడా ఇంద్రగంటే దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నాడు నాని.
అంతే కాదు.. దర్శకుడిగా ఇంద్రగంటి 25వ సినిమాలోనూ తాను నటించాలంటున్నాడు. శుక్రవారం ఇంద్రగంటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ నాని ఈ కామెంట్ పెట్టాడు. ‘వి’ అనుకున్నట్లే మార్చి 25న రిలీజైతే.. ఇంద్రగంటి పుట్టిన రోజు ఆయన కొత్త చిత్రం అనౌన్స్ అయ్యేదేమో. ఐతే ‘వి’ రిలీజయ్యాక తాను పెద్ద హీరోలతో యాక్షన్ ఎంటర్టైనర్లు తీయగలనని చాటిచెప్పి.. కెరీర్లో నెక్స్ట్ స్టెప్ వేయాలని ఇంద్రగంటి చూస్తున్నట్లు సమాచారం.