ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

డార్క్ మోడ్ మూవీతో నాని ప్రయోగం?

హీరో నానికి వైవిధ్యమైన సినిమాలు చేయడం అంటే ఇష్టం. అయితే అతని అన్ని ప్రయోగాలను జనం యాక్సెప్ట్ చేయలేదు. అలా అని ఆయన చేయకుండా మానలేదు. ఈ మధ్య అంతా లైటర్ వీన్ ఫన్, ఎంటర్ టైన్ మెంట్, లవ్, ఫ్యామిలీ సబ్జెక్ట్ లు చేస్తున్న నాని ‘వి’ సినిమాతో ఓ ప్రయోగం చేస్తున్నారు. రివెంజ్ డ్రామా మిక్స్ చేసిన కథలో ఓ సైకో కిల్లర్ గా కనిపించబోతున్నారు.

అలాగే త్వరలో పక్కా డార్క్ మోడ్, రంగస్థలం లాంటి రియలిస్టిక్ మూవీని చేయాలనుకుంటున్నాడు. తమిళంలో వచ్చిన రియలిస్టిక్ మూవీస్ టైపు కథ ఇది అని తెలుస్తోంది. నానికి ఎప్పటి నుంచో లుంగీ కట్టుకుని, రియలిస్టిక్ విలేజ్ గెటప్ తో ఓ సినిమా చేయాలని కోరిక.

నిజానికి ఈ కథను చాన్నాళ్ల కిందటే విన్నాడు. చేస్తాను కానీ ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేనని, కథ చెప్పిన కొత్త దర్శకుడు శ్రీకాంత్ కు చెప్పేసాడు. అన్నట్లుగానే ఈ కథ విన్నాక ఇప్పటికి ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. మరో ఒకటి రెండు రాబోతున్నాయి.

ఇప్పటికి ఈ కథకు నిర్మాతను ఫైనల్ చేసాడు. గతంలో పడిపడి లేచె మనసు సినిమాను తీసిన సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తారు. ఈ సినిమాతో సుకుమార్ రైటింగ్స్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మేరకు గతంలో వచ్చిన గ్యాసిప్ లు వాస్తవం కాదని తెలుస్తోంది.

Exit mobile version