నేచురల్ స్టార్ నాని పక్కింటి అబ్బాయిలా అందరితోనూ కలిసిపోయాడు. ఈయన్ని చూస్తుంటే హీరోలా అస్సలు అనిపించడు. చేసే పాత్రలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి అందరి ఇంట్లోని కుర్రాడిలా మారిపోయాడు నాని. అందుకే నేచురల్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చేసారంతా. ఈయన తన కుటుంబాన్ని వీలైనంత ప్రైవేట్‌గానే ఉంచుతుంటాడు. అప్పుడప్పుడూ బయట కనిపిస్తుంటారు. ఇప్పుడు కూడా నాని తన అక్క దీప్తితో ఉన్న ఓ ఫోటో బయటికి వచ్చింది. అది ఇప్పటిది కాదు.. నాని సినిమాల్లోకి రాకముందు.. ఆయన హీరో కాకముందు ఫోటో. అప్పట్లో చాలా సన్నగా ఉండేవాడు నాని.
శ్రీనువైట్లతో ఢీ.. రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు.. బాపుతో రాధాగోపాలం లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు. ఆ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మాతో హీరో అయ్యాడు. ఆ వెంటనే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మళ్లీ నిలబడి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు నాని. ఈ ప్రయాణంలో తన అక్క దీప్తి పాత్ర కూడా చాలా ఉందని చాలా సార్లు చెప్పాడు ఈయన. చిన్నపుడు చాలా అల్లరి చేసే తమ్ముడ్నే అంటూ చెప్పుకొచ్చాడు నాని. అలాంటి అరుదైన ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది.