‘విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందో లేదో కానీ, వైసీపీ మార్క్ పులివెందుల పోలీసింగ్‌తో అరాచకాలకు అడ్డాగా మారింది’ అని లోకేశ్ విమర్శించారు. ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా యువతిపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు.
అయితే.. లక్ష్మీ అపర్ణపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించలేదని ఏసీపీ హర్షిత్ చంద్ర తెలిపారు. కర్ఫ్యూ సమయంలో విధుల నుంచి ఇంటికెళ్లేందుకు అమెవద్ద అవసరమైన పత్రాలు ఉన్నా.. నిన్న అవి తీసుకురాలేదు. దీంతో పోలీసులు ఫైన్ విధించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులను నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. ఆమెను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నంలో ప్రతిఘటించింద’ని అన్నారు.