ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నవ్వుతూ అబద్దాలు చెప్పడం జగన్ కు అలవాటు.. అదే ఆయన నైజం: లోకేశ్

సీఎం జగన్ కు నవ్వుతూ అబద్దాలు ఆడడం అలవాటని.. అందుకే జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై కూడా అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారని నారా లోకేశ్ అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం సాగదీత ధోరణి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలకంటే తమకు ఏదీ ఎక్కువ కాదని.. ప్రజా సమస్యలపై తామెప్పుడూ పోరాడతూనే ఉంటామని స్పష్టం చేశారు.

జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలయితే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. గతంలో ఒకే సామాజికవర్గానికి చెందిన 37 మంది డీఎస్పీలకు ప్రమోషన్ల ఇచ్చామని తమపై రాష్ట్రపతికే అబద్దాలు చెప్పిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను అప్పట్లో తాము కొనుగోలు చేస్తే జగన్ అధికారంలోకి వచ్చేవారా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఆర్డీఏ చట్టాన్ని రైతులకు అనుకూలంగా చేయబట్టే సీఆర్డీఏ చట్టం గెలిచిందని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి.. రాజధాని ఒకటే ఉండాలనేది తమ విధానమని అన్నారు.

Exit mobile version