‘ఈ సినిమా కోసం ప్రవీణ్ ఎన్నో కలలు కన్నారు. కానీ.. ఆయన ఆశలు తీరకుండానే దూరమవడం బాధగా ఉంది. షూటింగ్ జరిగే ప్రతి రోజూ ప్రవీణ్ ను తలచుకున్నాం. ఈ సినిమాను ప్రవీణ్ కే అంకితం ఇస్తున్నాం. చాలా మంచి వ్యక్తిని కోల్పోయాం. ప్రవీణ్ గురించి మాకే ఇంత బాధగా ఉంటే ఆయన కుటుంబం ఇంకెంత బాధపడుతుందో అర్ధం చేసుకోగలం. ప్రవీణ్ ఎక్కడున్నా ఈ సినిమాను చూస్తాడనే నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. దర్శకుడు సుధీర్ వర్మ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆయన వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు ప్రవీణ్. ఆయన మృతితో శిష్యుడి సినిమాను పూర్తి చేశారు సుధీర్ వర్మ.