ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

నయనతారపై రాధరవి వివాదాస్పద వ్యాఖ్యలు

లేడీ సూపర్‌ స్టార్‌ గా పేరున్న నయనతార పై గతంలో తమిళ నటుడు కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్టు రాధా రవి వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. రాధా రవి ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన డీఎంకే పార్టీలో ఉన్నాడు. నయనతార పై వ్యాఖ్యలు చేసినందుకు గాను రాధా రవిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఆ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. పార్టీ అధినాయకత్వం రాధారవిపై చర్యలు తీసుకోవడానికి ముందే ఆయనే స్వయంగా పార్టీని వదిలేశాడు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నాడు.

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అన్నాడీఎంకే మరియు బీజేపీ కూటమి తరపున రాధా రవి ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సమయంలో డీఎంకేలో తాను ఉన్న సమయంలో నయనతార పై వ్యాఖ్యలు చేసినందుకు నన్ను తొలగించాలనుకున్నారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ తో ఆమె రిలేషన్ లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రాధా రవి నోరు అదుపులో పెట్టుకోకుంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Exit mobile version