Advertisement

నయనతార రేంజ్ .. ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి!

Posted : November 18, 2021 at 12:50 pm IST by ManaTeluguMovies

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతార అంటే తెలియనివారు లేరు. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఆమెకి వంకబెట్టేవారే లేరు. నయనతార కూడా సినిమా ఫీల్డ్ కి మోడలింగ్ నుంచే వచ్చింది. అయితే సినిమాల పట్ల ఆమెకి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.

మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ పట్టుబట్టడంతో ఒక సినిమాలో చేసి చూద్దామని చెప్పేసి ‘మనస్సినక్కరే’ అనే సినిమా చేసింది. ఆ తరువాత నుంచి కెరియర్ పరంగా ఆమె వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ మలయాళ మూవీ తరువాత చాలా తక్కువ గ్యాపులోనే ఆమె తెలుగు .. తమిళ భాషలకి పరిచయమైంది.

తమిళంలో ‘అయ్యా’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయన్ తెలుగులో ‘లక్ష్మీ’ సినిమాతో అడుగుపెట్టింది. అయితే అంతకుముందే వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ‘ఈ భారీ అందాల భామ ఎవరబ్బా’ అని అప్పుడే అంతా అనుకున్నారు.

వెన్నెల్లో తేలుతున్న వెన్నముద్దలా ఉందే అనుకుని మనసులు పారేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి నయన్ కి ఎక్కువ సమయం పట్టలేదు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున .. రవితేజలతో ఆమె సినిమాలు చేస్తూ వెళ్లింది.

తెలుగులోని సీనియర్ స్టార్ హీరోలందరితోను ఆమె నటించినప్పటికీ బాలకృష్ణ జోడీగానే ఆమె బాగుందని చెప్పుకున్నారు. ఇక తమిళంలోను ఆమె సీనియర్ స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయిక అనిపించుకుంది.

స్టార్ హీరోయిన్ అయిన ఆమె వర్ధమాన హీరోల జోడీగా చేయడానికి కూడా వెనుకాడకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆమె ఎప్పుడు పారితోషికం పెంచినా .. వచ్చిన అవకాశం వెనక్కి వెళ్లలేదు. నయనతార ఓకే అంటే చాలు అన్నట్టుగానే నిర్మాతలు కాచుకుని ఉండేవారు .. ఇప్పటికీ అదే పరిస్థితి.

ఆరంభంలో అందాలు ఆరబోయడానికి పెద్దగా అభ్యంతరపెట్టని నయనతార ఆ తరువాత తరువాత గ్లామరస్ పాత్రలకి కాస్త దూరం జరుగుతూ వెళ్లింది. నటన ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చింది. హీరో సరసన అలాంటి పాత్రలు అరుదుగా తప్ప రావు. అందుకే ఆమె లేడీ ఓరియెంటెడ్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక అక్కడి నుంచి ఆమె కెరియర్ మరింత స్పీడ్ అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్ల జోనర్లలో ఆమె చేసిన నాయిక ప్రధానమైన సినిమాలు వరుసగా భారీవిజయలను నమోదు చేస్తూ వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలతో సమానమైన వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు కూడా సీనియర్ స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం వెయిట్ చేయవలసిందే.

సినిమాల పరంగా వస్తున్న ప్రశంసలనుగానీ .. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలను గాని పట్టించుకోకపోవడం నయనతార ప్రత్యేకత. ఎవరు ఏమైనా చెప్పుకోని తాను చేయవలసిన పనిని చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె విఘ్నేశ్ శివన్ తో సహజీవనం చేస్తోంది.

ఈ జంట ఎప్పుడు పెళ్లి మంటపానికి వెళుతుందా అని అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సినిమా సినిమాకి నయన్ క్రేజ్ పెరుగుతూనే ఉంది .. దాని వెనుక ఆమె పారితోషికం పరుగెడుతూనే ఉంది. ఈ రోజున నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.


Advertisement

Recent Random Post:

గాల్లో వచ్చి గాలిలో కలిసిపోతానా…? CM Jagan In Assembly

Posted : November 26, 2021 at 4:03 pm IST by ManaTeluguMovies

గాల్లో వచ్చి గాలిలో కలిసిపోతానా…? CM Jagan In Assembly

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement