ఇక ప్రస్తుతం ఈమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరు కూడా విడిపోయారు అంటూ కొన్ని సార్లు, వీరిద్దరు గొడవ పడుతున్నారు అంటూ కొన్ని సార్లు రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పుకార్లకు చెక్ పెట్టేందుకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. గత కొన్నాళ్లుగా వీరిద్దరు కూడా సహజీవనం సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా క్రేజ్ ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంటే ఆఫర్లు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో నయన్ పెళ్లికి వెనుకంజ వేసింది.
ప్రస్తుతం నయనతార పెళ్లికి రెడీ అయ్యింది. హీరోయిన్ గా ఇప్పటికి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా ఈమె పెళ్లికి సిద్దం అంది. ఈ ఏడాది చివరి వరకు వీరిద్దరి ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో వైభవంగా జరుగబోతుంది. అందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. త్వరలోనే పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన విఘ్నేష్ శివన్ లేదా నయనతార నుండి వస్తుందని తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.