Advertisement

నయన్ పెళ్లిలో మన స్టార్స్ ఎక్కడ?

Posted : June 9, 2022 at 7:21 pm IST by ManaTeluguMovies

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం అంగరంగ వైభవంగా నేడు తమిళనాడు లోని మహాబలిపురంలో జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో పాటు తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్ ఇంకా సూర్య తదితరులు హాజరు అయ్యారు. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకులు పదుల సంఖ్యలో ఈ పెళ్లికి హాజరు అయ్యారు. తమిళ సినీ ప్రముఖులు ఎంతో మంది హాజరు అయిన ఈ పెళ్లిలో టాలీవుడ్ స్టార్స్ కనిపించలేదు.

నయనతార తెలుగు లో ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగు లో స్టార్ హీరోయిన్ హోదా ను నయన్ కు ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వారు ఇవ్వడం జరిగింది. అయినా కూడా టాలీవుడ్ కు చెందిన ఏ ఒక్కరిని నయనతార ఆహ్వానించలేదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విఘ్నేష్ శివన్ తనకు సన్నిహితులు అయిన తమిళ ఇండస్ట్రీ వారిని ఆహ్వానించారు. కాని నయన్ మాత్రం ఎక్కువ మందిని ఆహ్వానించలేదు అంటున్నారు.

ఇటీవలే నయనతార కాతువాకుల రెండు కాదల్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా కు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా లో సమంత మరో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో నయన్ మరియు సామ్ లు చాలా క్లోజ్ గా కనిపించారు. కాని నయన్ పెళ్లి లో మాత్రం సమంత కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.

సమంత మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రముఖులు ఏ ఒక్కరు కూడా నయనతార పెళ్లికి హాజరు అయినట్లుగా కనిపించడం లేదు. నయనతార సింపుల్ గా పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ తో సుదీర్ఘ కాలపు ప్రేమను మూడు ముళ్ల బంధంగా మార్చుకుంది. నటిగా తెలుగు లో ఎన్నో సినిమాల్లో నటించి ఇక్కడ స్టార్ డమ్ దక్కించుకున్న నయన్ ఎందుకు తెలుగు స్టార్స్ ను ఆహ్వానించలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రెండు రోజుల్లో చెన్నై లో భారీ ఎత్తున రిసెప్షన్ ఉంటుందని అంటున్నారు. మరి ఆ రిసెప్షన్ కు అయినా మన వాళ్లను నయన్ దంపతులు ఆహ్వానిస్తారా లేదా అనేది చూడాలి. పెళ్లి హైదరాబాద్ లో జరిగి ఉంటే పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యి ఉండేవారు. అక్కడ పెళ్లి అవ్వడం వల్ల ఆహ్వానం అందినా కూడా ఆసక్తి చూపించక పోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Ayyanna Patrudu Son Chintakayala Vijay Reacts on their House Demolition

Posted : June 19, 2022 at 1:03 pm IST by ManaTeluguMovies

Ayyanna Patrudu Son Chintakayala Vijay Reacts on their House Demolition

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement