గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, కాజల్ వంటి సెలెబ్రిటీల వివాహాల నేపథ్యంలో ఈ కట్నకానుకలపై రకరకాల రూమర్లు షికార్లు చేసాయి. అయితే వీటిలో ఎంత వరకూ నిజానిజాలు ఉంటాయో ఎవరికీ తెలీదు కానీ వినడానికి, ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఈ రూమర్స్ భలే ఆసక్తిగా అనిపిస్తాయి.
వచ్చే నెల 9న నాగబాబు కూతురు నిహారిక పెళ్లి జరగనున్న విషయం తెల్సిందే. ఉదయ్ పూర్ లోని ఒక ప్యాలెస్ లో ఈ వివాహం ఆర్భాటంగా జరగనుంది. ప్రస్తుతం నిహారిక అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి కొడుకు చైతన్య జొన్నలగడ్డకు, వారి కుటుంబానికి కట్నకానుకలుగా నాగబాబు కుటుంబం భారీగానే సమర్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పెళ్ళికి దాదాపు 10 కోట్ల రూపాయలను లాంఛనాల కింద పెళ్లి కొడుకు కుటుంబానికి ఇస్తున్నారట. ఇక నిహారికకు దాదాపు 2 కోట్లు విలువ చేసే బంగారంను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కాకుండా నిహారిక-చైతన్యలకు హైదరాబాద్ లో ఒక ఇంటిని బహుకరించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో అధికారిక ధ్రువీకరణ అంటూ ఏం ఉండదు మరి.